గుంటూరు ఎడ్యుకేషన్: సాంకేతిక రంగంలో మార్పులను ఉపాధ్యాయులు అభ్యసించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ పరీక్షలో ఇంగ్లీష్ బాషాంశాలు అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ పరీక్ష ఉపాధ్యాయులను విద్యార్థులుగా మార్చిందన్నారు. వేగంగా మారిపోతున్న విజ్ఞానశాస్త్రం, సాంకేతిక రంగం మార్పులను ఉపాధ్యాయులు అభ్యసించాలని అన్నారు. తద్వారా ఆధునిక విద్యార్థులను తయారు చేయగలరని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ బోధనా శాస్త్రాల పునఃశ్చరణ కల్పించి టీచర్లు అందరూ టెట్ లో ఉత్తీర్ణులయ్యేలా యూటీఎఫ్ క్లాసులు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరు కావడం అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ హక్కుల కోసం పోరాటంలోనూ, అవసరమైన సందర్భంలో ఉపాధ్యాయులకు అండగా ఉండటంలోనూ యూటీఎఫ్ ముందుంంటుందన్నారు. రాబోవు ఆదివారం సైతం టెట్ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, టి.ఆంజనేయులు, ఏ.శ్రీనివాసరావు, ఎం. గోవింద్, కె.కామాక్షి, కె.రంగారావు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి ఆడిట్ కమిటీ సభ్యులు వి.వినోద్, ఎన్. ధనలక్ష్మి, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు


