న్యూస్‌రీల్
పెరుగుతున్న వడ్డీల భారం
సాగర్ నీటిమట్టం వివరాలు
పాలకవర్గాలు ఉంటేనే కార్మికులకు ప్రయోజనం
బాపట్ల
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
● బకాయిలు చెల్లించాలని
కోరుతున్న చేనేత సంఘాల ప్రతినిధులు
● కార్మికులకు పని భద్రత ఏదీ?
● సంఘాల బలోపేతానికి కొరవడిన చర్యలు
చీరాల అర్బన్: కళాత్మక వృత్తిదారుల బతుకులు కత్తిమీద సాములా మారాయి. అసలే పెరిగిన ధరలు, జీఎస్టీల భారంతో సతమతమవుతుంటే ఆదుకుంటాయనుకున్న చేనేత సహకార సంఘాలు కూడా మూలన పడుతున్నాయి. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన పలు పథకాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు మొండి బకాయిలుగా మారాయి. త్రీఫ్ట్ ఫండ్ 8 శాతం, పావలా వడ్డీ, నూలు, రంగులు, రసాయనాలు తదితరాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు ప్రధానమైనవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొసైటీలకు సంబంధించి రూ.203 కోట్లు విడుదల కావాలి. జిల్లావ్యాప్తంగా 75 సహకార సంఘాలు ఉండగా ప్రస్తుతం 34 సంఘాలు సేవలు అందిస్తున్నాయి. ఆయా సొసైటీలకు కోట్లాది రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయి. సంఘాలకు పాలకవర్గం పదవీ కాలం ఎప్పుడో ముగిసినా.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియడంలేదు.
జిల్లాలో ప్రస్తుతం 34 సంఘాలు మాత్రమే మిణుకుమిణుమంటున్నాయి. మిగిలిన సంఘాలు మూలన పడ్డాయి. దీంతో ఆయా సంఘాల్లో పనిచేసే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న సంఘాల నిర్వహణ కూడా అధికారులకు తలకు మించిన భారంగా మారింది. నిధుల లేమి, సిబ్బంది కొరత అందుకు కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సవిత మాత్రం చేనేత సహకార సంఘాల బకాయిలు త్వరలో చెల్లిస్తామంటూ మాటలు మాత్రం చెప్తున్నారు.
బ్యాంకుల నుంచి సంఘాలు తీసుకున్న అప్పు( క్యాష్ క్రెడిట్)కు వడ్డీ భారం పెరుగుతోంది. సంవత్సరాల తరబడి వడ్డీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ తడిసి మోపెడు అవుతోందని గత పాలకవర్గాల ప్రతినిధులు చెప్తున్నారు. దీంతో సొసైటీలకు ప్రస్తుతం ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. చేనేత సహకార సంఘాలకు సంబంఽధించి గతంలో కొన్ని లోపాలు వెలుగు చూసిన మాట వాస్తవమే. అయితే పూర్తిగా పాలకవర్గాలు లేకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 513.70 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.
నేతన్నలకు చేయూత కొరవడింది. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం చేనేత సహకార సంఘాల లక్ష్యాన్ని నీరుగార్చుతోంది. వాటి బకాయిల చెల్లింపునకు అడ్డు పడుతూ వేలాది మంది చేనేత కార్మికుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయినా చోద్యం చూస్తోంది.
చేనేత సహకార సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీ భారీగా మారింది. ఈ క్రమంలో ముందు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆ క్రమంలోనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించాలి. ఆ రెండు జరిగితేనే చేనేత సహకార సంఘాలు మనగలుగుతాయి. లేదంటే కనుమరుగు కాక తప్పదు.
– కాటూరి వెంకటేశ్వర్లు,
శ్రీ వెంకట వీరాంజనేయ చేనేత సహకార సంఘం, మాజీ అధ్యక్షుడు, ఈపురుపాలెం


