‘సర్‌’ ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ వేగవంతం చేయాలి

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

వేమూరు: సర్‌ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. మండల కేంద్రంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేమూరు నియోజక వర్గంలోని సర్‌ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందోనని బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ఆన్‌లైన్‌ విధానం వంద శాతం పూర్తి చేయాలని నియోజక వర్గం ఎన్నికల అధికారి, బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌ గౌడ్‌కు సూచించారు. తహసీల్దారు పార్వతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

‘సర్‌’ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

బాపట్ల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని దేవుడి మాన్యం 11వ వార్డు, సచివాలయ 2, పోలింగ్‌ స్టేషన్‌ 96లో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తనిఖీ చేశారు. ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందని ఓటర్లును అడిగితెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట బాపట్ల ఆర్డీఓ ఎ.హరి కుమార్‌, డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.హాసిని, సూపర్‌ వైజర్‌, బీఎల్‌ఓలు తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement