మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఈనెల 9న ప్రకటించిన సీఎం ఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ర్యాంకుల ప్రభంజనాన్ని సృష్టించారని సంస్థ అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌ తెలిపారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్‌ మైండ్స్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ప్రకటించిన టాప్‌–10 ర్యాంకులలో 9 ర్యాంకులను తమ విద్యార్థులు కై వసం చేసుకున్నారని తెలిపారు. మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు వరసగా 2, 4, 5, 6, 6, 6, 7, 8, 10 ఆల్‌ ఇండియా ర్యాంకులు సాధించారని, ఒకే విధమైన మార్కులు వచ్చిన విద్యార్థులకు ఒకే విధమైన ర్యాంకు కేటాయిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల ప్రకటించిన సీఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో 4, 5, 8, 15, 16 వ ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించారని వివరించారు. అతి పిన్న వయస్సులోనే విద్యార్థులు సీఏ, సీఎం ఏ కోర్సులను సమాంతరంగా పూర్తి చేయటం అభినందనీయమని అన్నారు.

సీఏ, సీఎంఏ

ఫౌండేషన్‌

ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement