జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యవర్గానికి నియామక పత్రాల అందజేత | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యవర్గానికి నియామక పత్రాల అందజేత

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యవర్గానికి నియామక పత్రాల అందజేత

తెనాలి: గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గంలో నియమితులైన వారికి జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు తెనాలిలో నియామక పత్రాలను అందజేశారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గీతా మందిరంలో శుక్రవారం రాత్రి ఈ సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గంలో తెనాలికి చెందిన పలువురికి అవకాశం లభించింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్త రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సంకా లక్ష్మీనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులుగా మాలేపాటి తిరుమలేశ్వర్రావు, బీటీవీఎస్‌ నారాయణ, జాయిన్‌ జాయింట్‌ సెక్రటరీలుగా కొమ్మూరు కృష్ణ, అచ్యుత సాంబశివరావు, డైరెక్టర్లుగా కాజా గిరిధర్‌, శెనగపల్లి నరేంద్ర కుమార్‌, సుగ్గుల రవీంద్రకుమార్‌ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమా మహేశ్వరరావు నియామకపత్రాలను అందజేశారు. సంఘ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల పురోగతికి తోడ్పడతామని నూతన కార్యకర్వం ప్రకటించింది. పదోతరగతిలో 578 మార్కులు సాధించిన వక్కలగడ్డ భాగ్యశ్రీలక్ష్మికి నూతన పాలకవర్గం రూ.10 వేల నగదును బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement