2023లో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.1.34 కోట్లుతో నిర్మించిన వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఒకే చోట వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖల పరీక్షలు రెండేళ్లు అయినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా ల్యాబ్
పూర్తి నిర్లక్ష్యం..
వేటపాలెం: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్థక, మత్స్యశాలకు సంబంధించిన ఎటువంటి పరీక్షలు చేయించు కోవాలన్నా జిల్లా కేంద్రాలకు వెల్లాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి రైతు పక్షపాతి అని నిరూపించుకొన్నారు.
2023లో చీరాల నియోజవర్గ పరిధిలో వేటపాలెం మండలంలో రూ.1. 37 కోట్లతో నూతనంగా వైఎస్సార్ ఇంటి గ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. (ఈ అత్యాధునిక ప్రయోగశాల్లో వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖలకు సంబంధించిన అన్ని పరీక్షలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.) రైతులకు అందు బాటులో ఉండే ఒక వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 20 వ్యవసాయ ప్రయోగ శాలలు మాత్రమే ఉండేవి. వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 147 వ్యవసాయ ప్రయోగ శాలలు ఏర్పాటు చేయడం విశేషం. బాపట్ల జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో ఆరు ప్రయోగ శాలలు ఏర్పాటు చేశారు.
ఎన్నో సేవలు
వ్యవసాయ శాఖకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్ష, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయు ఉపకరణల నాణ్యత పరీక్ష, డీలర్స్ అమ్మే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యత పరీక్షలు, సాయిల్ టెస్టులు చేస్తారు.


