బాపట్ల అభివృద్ధికి కోన ప్రభాకరరావు కృషి | - | Sakshi
Sakshi News home page

బాపట్ల అభివృద్ధికి కోన ప్రభాకరరావు కృషి

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

బాపట్ల: బాపట్ల ప్రాంతాభివృద్ధికి మాజీ గవర్నర్‌ కోన ప్రభాకరరావు చేసిన కృషి భావితరాలకు ఆదర్శమని మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పేర్కొన్నారు. కోన ప్రభాకర్‌రావు జయంతి సందర్భంగా పాతబస్టాండ్‌ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ... బాపట్ల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా, పరిశ్రమవాడగా ప్రభాకరరావు తీర్చిదిద్దారన్నారు. 1962 బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీని ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కృష్ణా డెల్టా నుంచి సాగు, తాగు నీటిని రప్పించేందుకు విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బాపట్లలో మంచినీటి చెరువు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు ఏడాదికి రూ.రెండు కోట్లు మున్సిపాలిటీకి నీటి పన్ను కింద రావడానికి ప్రభాకరరావు కృషే కారణమని పేర్కొన్నారు. బాపట్లలో మరో చెరువు ఏర్పాటు చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి రూ.28 కోట్లు మంజూరు చేయించటం జరిగిందని కోన చెప్పారు. ప్రతిపాదనల్లో కొద్దిపాటి జాప్యం వలనే పనులు ఆలస్యం కావడం, ఆ ప్రతిపాదనలు ముందుకు రాలేదన్నారు. నల్లమడ పరివాక ప్రాంతాన్ని అంతా కలిపి బాపట్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోన ప్రభాకరరావు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.

జగనన్న కాలనీలో వసతులు కల్పించండి

ఆయనను ఆదర్శంగా తీసుకుని 2002లో రాజకీయాల్లోకి వచ్చిన తాను జిల్లా సాధించుకునేందుకు కృషి చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని హంగులు ఉండేలా అధికార పార్టీ కృషి చేయాలని కోరారు. బాపట్ల మున్సిపాలిటీ గ్రేడ్‌ 2గా ఉండగా .. పలు గ్రామాలను కలిసి గ్రేడ్‌ 1గా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. లక్ష జనాభా ఉండటం వల్లే నేడు అమృత్‌ పథకానికి ఎంపికై రూ.23 కోట్ల నిధులు వచ్చాయని కోన చెప్పారు. అప్పట్లో ఆ నిధులు వస్తే జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రతిపాదించామని చెప్పారు. జగనన్న కాలనీకి ఎన్టీఆర్‌ కాలనీ అని పేరు పెట్టుకున్నా ఫర్వాలేదని, కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, కోకి రాఘవరెడ్డి, నక్కా వీరారెడ్డి, గవిని కృష్ణమూర్తి, వడ్డిముక్కల డేవిడ్‌, చల్లా రామయ్య, పిన్నిబోయిన ప్రసాద్‌, గంగిశెట్టి రత్తయ్య, ఎం.రమేష్‌, నర్రావుల వెంకట్రావు, ఉరబిండి గోపీనాథ్‌, ఆట్ల నాగేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement