68 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

68 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పక్కదారి

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

డీలర్‌పై 6ఏ, క్రిమినల్‌ కేసులు నమోదు

రేపల్లె: పట్టణంలోని రేషన్‌ దుకాణం నంబర్‌–2లో భారీ స్థాయిలో రేషన్‌ బియ్యం అక్రమంగా విక్రయించిన వ్యవహారం సివిల్‌ సప్లైస్‌ శాఖ ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 68 క్వింటాళ్లు రేషన్‌ బియ్యం నిల్వల్లో లేకపోవడంతో అధికారులు విస్తుపోయారు. డీఎస్‌ఓ జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో రేషన్‌ డీలర్‌ కె.నాగబాబు స్టాక్‌ను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. రికార్డుల్లో, దుకాణంలో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ డీలర్‌పై 6ఏ కేసుతోపాటు క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మళ్లించడం తీవ్ర నేరమని, ఇలాంటి వాటికి పాల్పడే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో డీటీ ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement