రేపల్లెలో విద్యుత్‌ విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రేపల్లెలో విద్యుత్‌ విజిలెన్స్‌ తనిఖీలు

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

రేపల్లె: విద్యుత్‌ చౌర్యానికి పాల్పడినా, దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్‌ విజిలెన్స్‌ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌ మూర్తి హెచ్చరించారు. పట్టణ, మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్‌ మీటర్లను విద్యుత్‌శాఖ విజిలెన్స్‌ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణ, మండలంలోని 3762 విద్యుత్‌ సర్వీసులను తనిఖీలు చేశామన్నారు. దీనిలో 240 మంది వినియోగదారులు అధిక లోడు వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి రూ.8.72లక్షల పెనాల్టీలు విధించామన్నారు. ముగ్గురు వినియోగదారులు కేటగిరి మార్పు గమనించి రూ.20వేల పెనాల్టీ విధించామన్నారు. తనిఖీలలో జిల్లాలోని 130 మంది విద్యుత్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో ాపట్ల ఆపరేషన్‌ ఎస్‌ఈ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌లు ఎం.భాస్కరరావు, భాస్కరరావు, రాజేష్‌, రేపల్లె డిప్యూటీ ఈఈ శ్యామ్‌సుధాకర్‌బాబు, ఏఈ ఎం.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులు రేపల్లె పట్టణంలో గురువారం విస్తృత స్థాయిలో ఇంటెన్సివ్‌ ఇనిస్పెక్షన్స్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమతించిన పరిమితికి మించి విద్యుత్‌ వినియోగిస్తున్న వందలాది కనెక్షన్లు బయటపడగా, భారీ మొత్తంలో జరిమానాలు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement