ఇచ్చేదెన్నడో! | - | Sakshi
Sakshi News home page

ఇచ్చేదెన్నడో!

Aug 31 2025 7:50 AM | Updated on Aug 31 2025 7:50 AM

ఇచ్చే

ఇచ్చేదెన్నడో!

ఇచ్చేదెన్నడో!

గ్రామ సచివాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు ప్రదక్షిణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా పట్టించుకోని వైనం ఇప్పటికీ ప్రారంభం కాని దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్‌..

కొత్త పింఛన్ల నమోదుకు ఆదేశాలు రావాల్సి ఉంది

కొత్త పింఛన్‌

వేటపాలెం: పేదలకు సంక్షేమం అందించడంలో కూటమి ఘోరంగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంలో ఆవేదన తప్ప మిగిలిందేమీ కనిపించడంలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నేటికీ ఒక్క సంక్షేమ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేసిన దాఖలాల్లేవు. చివరకు ఏ దిక్కూ లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కూడా పింఛన్లు మంజూరు చేయడం లేదు. దీంతో పలువురు అర్హులు ఎప్పుడు పింఛన్‌ మంజూరు చేస్తారంటూ సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇటీవల స్పౌజ్‌ కేటగిరీలో పింఛన్ల మంజూరు చేసింది. పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతేనే భార్యకు ఆ పింఛన్‌ను బదిలీ చేస్తున్నారు. అసలు ఇప్పటికీ పింఛన్‌ రాని వ్యక్తి చనిపోతే వితంతు పింఛన్‌ ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారు. అలాగే ఇతర సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం 2,27,868 మంది సామాజిక పెన్షన్‌ దారులున్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలో 30,239 మంది ఉండగా వీరిలో చీరాల అర్బన్‌ పరిధిలో 8.093 మంది, రూరల్‌ పరిధిలో 11,438 మంది, వేటపాలెం మండలం పరిదిలో 10,718 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు.

అమలు కాని ఎన్నికల హామీ

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి 50 ఏళ్లకే పింఛన్‌ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇంత వరకు దీనిని ఆచరణలో పెట్టలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ప్రకటించ లేదు. జిల్లాలో అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వస్తున్నారు. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని వారికి సచివాలయ సిబ్బంది సమాధానం చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే కొత్త పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రయ నిరంతరం కొనసాగేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం పెన్షకు సంబంధించి వెబ్‌సైట్‌ నిలిపివేయడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారు నిత్యం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ల మంజూరులో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమనసరించిన విధానమే సరైందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పింఛన్‌దారులకు ఇంటి వద్దే పింఛను అందించేవారు. భర్త చనిపోయిన వారికి వితంతు పింఛన్లు మరుసటి నెలలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకునేవారు. ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరుకు అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ శాతం పింఛన్‌ మంజూరు చేయాలని అర్జీలు అందిస్తున్నారు.

కొత్తగా పింఛన్లు కోసం నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లు ఓపెన్‌ కావడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్త పింఛన్లు నమోదు చేసుకుంటాం.

–రాజేష్‌ ఎంపీడీఓ, వేటపాలెం

ఇచ్చేదెన్నడో! 1
1/1

ఇచ్చేదెన్నడో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement