
ముగిసిన క్యారమ్ పోటీలు
ఆంధ్ర స్టేట్ క్యారమ్ అసోసియేషన్
ఆధ్వర్యంలో పోటీలు
ప్రథమ బహుమతి అందుకుంటున్న
సీహెచ్ జనార్దనరెడ్డి, ఎ.భవాని
చిలకలూరిపేట: ఏపీ స్టేట్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ పోటీలు సీఆర్ క్లబ్‌లో రెండో రోజైన ఆదివారం ముగిశాయి. పురుషులు, మహిళల విభాగంలో విడివిడిగా నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి 150 మంది పురుషులు, 20 మంది మహిళలు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో సీహెచ్ జనార్దనరెడ్డి (విశాఖపట్నం), ఎన్.వెంకయ్య (నెల్లూరు), బి.జయకుమార్(గుంటూరు), బి.పవన్‌కుమార్ (అనంతపురం) నిలిచారు. మహిళల విభాగంలో ఎ.భవాని, ఎల్.హరిప్రియ, ఎంఎస్‌కే హారిక, ఎస్‌కే హుస్నా సమీర బహుమతులు సాధించారు. ఈ నలుగురు విశాఖపట్నం వారే కావడం విశేషం. సీహెచ్ జనార్దనరెడ్డి ఏడో ప్రపంచ కప్ క్యారమ్ పోటీలలో పాలొనేందుకు సీఆర్ క్లబ్ తరఫున రూ.లక్ష సహాయం అందించారు. ఏపీ స్టేట్ క్యారమ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీలకు చీఫ్ రిఫరీగా డాక్టర్ షేక్ సాజిదా, అసిస్టెంట్ చీఫ్ రిఫరీగా ఎండీ సిరాజ్ బాషా వ్యవహరించారు. కార్యక్రమంలో సీఆర్ క్లబ్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.నరసింహారావు, క్లబ్ కల్చరల్ ఇన్‌చార్జి గోరంట్ల నారాయణ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు అండగా ఉంటాం
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులకు ఏపీ ఎన్‌జీఓ సంఘం అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్‌బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. 15 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ముగిసిన క్యారమ్ పోటీలు