
అలా ‘నరసింహ’కు ఊపిరి పోసి...
వీరి ప్రయత్నంతోనే మండలంలోని బొల్లాపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గోశాలలోని ఆవు గర్భంలో ఫలదీకరించబడిన వేరే ఆవు పిండాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ‘నరసింహ‘ అనే ఒంగోలు జాతి కోడెదూడ 2023 సెప్టెంబర్ 12వ తేదీన పుట్టింది. వాస్తవానికి ఈ కోడె దూడ తాలూకు జన్యుపరమైన తల్లి ఆవు వయోభారంతో 2022 జూన్ నెలలోనే మరణించింది. అప్పటికే అంటే 2022 ఏప్రిల్ నెలలోనే ఈ ఆవు నుంచి సేకరించిన అండాల నుంచి అభివృద్ధి చేసిన పిండాన్ని అతి శీతలీకరణ పద్ధతిలో ద్రవ నత్రజనిలో భద్రపరిచారు. తల్లి మరణించిన సంవత్సరం తర్వాత కూడా అద్దె గర్భం ద్వారా పుట్టిన దూడగా నరసింహ రికార్డు సృష్టించటం గమనార్హం.