
రేపటి నుంచి నృసింహుని వార్షిక పవిత్రోత్సవాలు
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు సహాయ కమిషనర్, ఆలయ నిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు స్వామికి విశేష పూజలు నిర్వహించునున్నామని పేర్కొ న్నారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,500 క్యూసెక్కులు నీటిని ఆదివారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 216, బ్యాంక్ కెనాల్ 1,486, తూర్పు కాలువకు 452, పశ్చిమ కాలువకు 208, నిజాపట్నం కాలువకు 413, కొమ్మూరు కాలువకు 2,380 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,33,975 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా శ్రీనివాసరావు ఎన్నిౖకైనట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.తిరుమలేష్, సత్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని లయోలా కాలేజీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ సమావేశంలో భాగంగా జిల్లాకు చెందిన గుత్తా శ్రీనివాసరావు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. నిరంతరం ప్రధానోపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే వ్యక్తి అని తెలిపారు. శ్రీనివాసరావుకు పలువురు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు విజయ భాస్కర్, ఎండీ ఖాసీం అభినందనలు తెలియజేశారు.

రేపటి నుంచి నృసింహుని వార్షిక పవిత్రోత్సవాలు