ఉపాధి నిధులు బొక్కేశారు..! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి నిధులు బొక్కేశారు..!

Aug 31 2025 7:50 AM | Updated on Aug 31 2025 7:50 AM

ఉపాధి నిధులు బొక్కేశారు..!

ఉపాధి నిధులు బొక్కేశారు..!

ఉపాధి నిధులు బొక్కేశారు..!

బల్లికురవ ఉపాధి పనిలో సగానికి సగం అవినీతి ఏడాదిలో రూ.11.96 కోట్ల పనులు రూ.5.69 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేల్చిన సామాజిక తనిఖీ జిల్లాలో రూ.261 కోట్ల పనులు ఇందులో 70 శాతం అవినీతి జరిగిందని ఆరోపణలు

సాక్షి ప్రతినిధి,బాపట్ల: అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలో గడచిన ఏడాదిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.11,96,76,824 మేర పనులు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. ఇందులో రూ.5,69,41,282 అవినీతి జరిగినట్లు ఆగస్టు మొదటి వారంలో జరిగిన సామాజిక తనిఖీ వెల్లడించింది. దీనిని కప్పిపుచ్చేందుకు మండల ప్రిసైడింగ్‌ అధికారి హోదాలో జిల్లా డ్వామా అధికారి ప్రయత్నించినట్లు జరిగిన తతంగం పరిశీలిస్తే అర్థమవుతుంది. సామాజిక తనిఖీ చూపిన దాంట్లో రూ.3,89,46,581 మొత్తాన్ని అక్రమాల కింద అంగీకరించిన మండల ప్రిసైడింగ్‌ అధికారి ఇందులో రూ.2,36,03,181 మొత్తాన్ని రికవరీ కింద రాసి మిగిలిన రూ.1,16,66,909 మొత్తా న్ని రిఫర్డ్‌(మళ్లీవిచారణ) కింద, రూ.36,91,856 మొత్తాన్ని రిక్టిఫైడ్‌ (సరిచే సుకోండి) కింద చూపి రూ.1.79,79,336 మొత్తాన్ని డ్రాప్‌డ్‌ అమౌంట్‌ కింద చూపెట్టి చేతులు దులుపుకున్నారు. సామాజిక తనిఖీ చూపెట్టిన అవినీతి రూ.5.69 కోట్లలో రికవరీ రూ. 2.36 కోట్లు మినహా మిగిలిన రూ.3.33 కోట్ల మొత్తాన్ని మాఫీ చేశారు. దీనివెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు డ్వామావర్గాల్లోనే గుసగుసలువినిపిస్తున్నాయి.

జిల్లాలో రూ.140 కోట్ల అవినీతి

జిల్లాలో గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.261 కోట్ల పనులు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. ఉద్యాన పంటలు, సేద్యపు నీటికుంటలు, పశువుల తాగునీటి తొట్లతోపాటు పలురకాల కాంక్రీట్‌ పనులు చేపట్టారు. ఇందులో రూ.199.56 కోట్ల మేర వేతనాల పనులు కల్పించినట్లు చూపారు. ఇందులో 70 శాతం అక్రమాలు అనుకున్నా రూ.140 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా మొత్తంగా జరిగిన ఉపాధి పనులపై ఉన్నతాధికారితో సమగ్ర విచారణ జరిపిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశముంది.

సాగునీటి మాటున ఉపాధి అవినీతి

వాస్తవానికి ఉపాధి పనులు నవంబర్‌, డిసెంబర్‌, జనవరిలో 20 శాతం మాత్రమే జరుగుతుండగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో మిగిలిన 80 శాతం జరుగుతున్నాయి. ఆ తర్వాత వర్షాలు కురవడం, సాగునీటి పథకాల ద్వారా కాలువలకు నీటిని విడుదల చేస్తుండడంతో పనులు చేయకపోయినా అధికారులకు చేసినట్లు రికార్డు చేసి నిధులు కొల్లగొడుతున్నారు. ఉపాధి పనులను ప్రతి మూడు నెలలకొకసారి సామాజిక తనిఖీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తే అక్రమాలను కంట్రోల్‌ చేసే అవకాశముంటుంది. కానీ డ్వామా అధికారులు ఏడాదికి ఒకసారి మాత్రమే సామాజిక తనిఖీలు పెట్టి అవినీతి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.

సామాజిక తనిఖీల్లో షాట్‌, డ్వామా కుమ్మక్కు

నిబంధనల మేరకు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ‘షాట్‌’, డ్వామా అధికారులు కలిసి ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. వాస్తవానికి సామాజిక తనిఖీ తొలుత గ్రామస్థాయిలో జరుగుతుండగా ఇందులో గ్రామస్థాయిలో ప్రిసైడింగ్‌ అధికారిగా మండలానికి చెందిన కొందరు గెజిటెడ్‌ అధికారులను నియమిస్తారు. గ్రామస్థాయి సామాజిక తనిఖీల్లో వీరిది జడ్జి పాత్ర. తప్పు జరిగితే ఎత్తిచూపే అవకాశం ఉంటుంది. కానీ గ్రామస్థాయి తనిఖీలకు వీరిని ఆహ్వానించకుండానే షాట్‌, డ్వామా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీరి నియామకమే జరగకపోగా మరికొన్ని మండలాల్లో వీరిని నియమించినా.. డ్వామా అధికారులు తనిఖీలకు పిలవడంలేదు. దీంతో అటు షాట్‌, ఇటు డ్వామా అధికారులు కుమ్మకై ్క పది శాతం అక్రమాలు చూపించి 90 శాతం అక్రమాలను మాఫీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement