
అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీలు సీజ్
బల్లికురవ: గ్రానైట్ పలకలు, ముడిరాళ్లు పర్మిట్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను మైన్స్, విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెల్లవారుజామున బాపట్ల జిల్లా బల్లికురవ నుంచి సంతమాగులూరు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులోని మల్లాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
పర్మిట్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఒక ముడిరాయి లోడు లారీ, రెండు గ్రానైట్ పలకల లోడు లారీలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. తనిఖీలో బాపట్ల జిల్లా విజిలెన్స్ ఏడీ రామచంద్ర, ఆర్‌ఐ రాజు పాల్గొన్నారు. అధికారులు తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అక్రమ రవాణాదారులు ఎక్కడికక్కడ లారీలను నిలిపేశారు. అక్రమ రవాణాతో ప్రతిరోజూ బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి భారీగా గండి పడుతోంది.