స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

Aug 24 2025 8:16 AM | Updated on Aug 24 2025 8:16 AM

స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

పర్యాటక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి

బాపట్ల: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కలెక్టరేట్‌ ప్రాంగణం 57 ఎకరాల మేర భూమి ఉందని ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన సంస్థలకు అవార్డుల ప్రదానోత్సవం చేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, హాస్టల్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తుందని చెప్పారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెయ్యి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్‌, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంథామరెడ్డి, ఎకై ్సజ్‌ అధికారి ఎస్‌ వెంకటేశ్వరరావు, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరావు, జిల్లా ప్రణాళిక అధికారి షాలేం రాజు, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వామిత్వ సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలి

స్వామిత్వ సర్వే పనులను అధికారులు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి ఆదేశించారు. స్వామిత్వ సర్వే, పి 4 అమలు, ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయం వంటి అంశాలపై డివిజన్‌, మండల స్థాయి అధికారులతో శనివారం స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం ద్వారా మాట్లాడారు. చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, చిన్నగంజాం, రేపల్లె, కర్లపాలెం, పి.వి పాలెం, పర్చూరు, మార్టూరు, చెరుకుపల్లి, రేపల్లె, నగరం, చుండూరు మండలాల్లో స్వామిత్వ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాలలో సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే పురోగతికి డీఎల్‌డీఓలు బాధ్యులని స్పష్టం చేశారు. స్వామిత్వ సర్వేపై ప్రతిరోజూ మండల స్థాయిలో సమీక్షలు జరగాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

పర్యాటక దినోత్సవాన్ని వైభవంగా జరపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకట మురళి చెప్పారు. జిల్లాలో సూర్యలంక బీచ్‌ లో బీచ్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ జి.గంగాధర్‌ గౌడ్‌, సర్వే ల్యాండ్స్‌ రికార్డ్స్‌ ఏడీ కనక ప్రసాద్‌, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement