
పొగాకు సాగును అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్
పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లాలో సాగుచేసే బ్లాక్, వైట్ బర్లీ పొగాకుపై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే పంటను ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తామని హెచ్చరించింది. తాజాగా నిషేధం అమలుకు అధికారులతో ఏకంగా టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీతోపాటు వ్యవసాయశాఖ అధికారి కమిటీలో ఉండగా, డివిజనల్ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, ఏడీ స్థాయి అధికారులు, మండల స్థాయిలో తహసీల్దారు, సీఐ, వ్యవసాయాధికారులతోపాటు ఇతర అధికారులు టాస్క్‌ఫోర్సులో సభ్యులుగా ఉండి సాగును అడ్డుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఏడాది సాగు చేయకూడదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

పొగాకు సాగును అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్

పొగాకు సాగును అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్