
ముందుకు రాని లైసెన్స్‌దారులు
కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది..
కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. ఇష్టానుసారంగా లైసెన్స్‌లు పెంచి దోచుకుంటుంది. హైదరాబాద్‌లో ఏడాదికి బార్ లైసెన్స్ రూ.45లక్షలు ఉండగా కూటమి ప్రభుత్వం ఒక్కో బారుకు రూ.75 లక్షలు కడి తేనే టెండర్లు వేయాలని హుకుం జారీ చేసింది. ఇది పక్కా దోపిడీ.
సూరగాని చెంచుబాబు, బార్ యజమాని
26 వరకు గడువు
కొత్త బార్ టెండర్లను ఈనెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. సోమవారం టెండర్లు వేసేందుకు ప్రారంభం కాగా ఒక్క టెండరు కూడా రాలేదు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ప్రభుత్వం మరో బార్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. 28న టెండర్ల బాక్సు తెరుస్తాం. ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉంది.
– పీ.నాగేశ్వరరావు, ఎకై ్సజ్ సీఐ, చీరాల
చీరాల: కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా లైసెన్స్ ఫీజు అడ్డగోలుగా పెంచడంతో టెండర్లు దాఖలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. హైదరాబాద్ వంటి భాగ్యనగరంలో సంవత్సరానికి బార్ లైసెన్స్ రూ.45 లక్షలు ఉండగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్క బార్‌కు రూ.75 లక్షలు కడితేనే టెండర్లు వేయాలని హుకుం జారీ చేసింది. దీంతో బార్ షాపుల యజమానులకు చిర్రెత్తుకొచ్చింది. దీనికి తోడు అమ్మిన అమ్మకాలలో 50 శాతం టాక్స్‌లు వసూలు చేస్తుంది. రెండు నెలల కాలపరిమితిలో ఈ టాక్స్ విధిస్తుంది. దీనికి తోడు రూ.100 లోపు చీప్ క్వార్టర్‌లు అమ్ముకోవడానికి వీలులేదు. ఇది కేవలం వైన్ షాపుల్లోనే అమ్మాలి. అలానే పార్సిల్ సర్వీస్ ఉండదు. సోమవారం నుంచి బార్‌లకు టెండర్లు ప్రక్రియ మొదలు కాగా చీరాలలో ఒక్క టెండరు రాలేదు. గతంలో చీరాల ప్రాంతంలో ఆరు బారు షాపులుండగా నష్టాల బారిన పడి రెండు మూసివేశారు. ప్రస్తుతం నాలుగు నడుస్తుండగా కూటమి ప్రభుత్వం మరో బారును అదనంగా పెంచింది. అంటే చీరాలకు ఏడు బారులను నిర్వహించాలని ప్రభుత్వ నిబంధన. దీంతో ఈ వ్యాపారం చేయలేమని ప్రభుత్వం బార్ లైసెన్స్‌ల విధానం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 17 బార్‌లు ఉండగా అదనంగా రెండు బార్‌లను గౌడ కులస్తులకు కేటాయించింది. కొన్ని సంవత్సరాలుగా బార్‌లను నడుపుతున్న యజమానులు కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. వైన్ షాపులకు 25 శాతం పర్సంటేజి ఇస్తామని, ఆ తర్వాత 9 శాతం మాత్రమే ఇచ్చారు. దీంతో వైన్ షాపుల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 14.5 శాతం ఇచ్చారు. మద్యం పాలసీలోనే కూటమి ప్రభుత్వం దోపిడీ, దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతుందని వాపోతున్నారు.
మొదటి రోజు నిల్