
స్ట్రయిట్‌కట్ కాలువ మలుపునకు అనుమతి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపునకు అనుమతిస్తూ, రెండు వర్గాల ఆమోదంతో పనులు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈమేరకు మత్స్య శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపు పరిష్కారం దిశగా లైన్ డిపార్టుమెంటు రైతు, మత్స్యశాఖ సంఘ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం మాలకొండయ్య, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈపురుపాలెం స్రైట్ కట్ కాలువ పై అడవి పాలెంలోని 7 గ్రామాలు, వాడరేవులోని 6 గ్రామాలు, 593 బోట్లతో 1126 మంది సొసైటీ సభ్యులు, 13 గ్రామాలు, 1303 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. రైతులు, మత్స్యకాలను దృష్టిలో పెట్టుకొని జెట్టి నిర్మాణానికి అనుమతి ఇస్తానని కలెక్టర్ తెలిపారు. రాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామన్నారు. మత్స్యకారులను దష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం కోసం రైతులకు, మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా కొంతమేరకు ఈపుపాలెం స్ట్రైట్ కట్ కాలువను మలుపు తిప్పాలని ఆయన అన్నారు. భూములు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. కాలువ శాశ్వత పరిష్కారం కోసం నిజాంపట్నంలో మాదిరిగా పెద్ద పెద్ద సిమెంటు దిమ్మెలను వేస్తూ, రెండు వైపులా రిటైనింగ్ చేయడం జరుగుతుందన్నారు. సర్వే శాఖ ఏడీ కనకరాజు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, బాపట్ల, చీరాల ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
బాపట్ల: కృష్ణా నది వరద విపత్తును సమర్థంగా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నామని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. పర్యావరణ విపత్తుల నిర్వహణపై హోం శాఖ మంత్రి అనిత, సీసీఎల్‌ఏ కమిషనర్ జయలక్ష్మి బుధవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లాలో తీసుకున్న రక్షణచర్యలపై జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి వివరించారు.