అందరికీ సమానత్వం అంబేద్కర్‌తోనే సాధ్యం
నరసరావుపేట: రాజ్యాంగంలో అందరికీ సమానత్వం కల్పించిన మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ అని ఎస్పీ కంచి శ్రీనివాసరావు కొనియాడారు. భారతరత్న అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించి ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయమైందని ఎస్పీ అన్నారు. . ఆయన చూపిన సమానత్వం, న్యాయం, సౌభ్రాతత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పోలీస్ సిబ్బంది అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తితో ఉద్యోగ నిర్వహణ చేయాలని సూచించారు. అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, అడ్మిన్ ఆర్.ఐ రాజా, వెల్ఫేర్ ఆర్‌ఐ గోపీనాథ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


