సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎగ్జిబిషన్ దోహదం
బాపట్ల: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు కెరీర్ ఎక్స్‌ఫో ఎగ్జిబిషన్ దోహదపడుతుందని బాపట్ల ఉపవిద్యాశాఖాధికారి శివబాబు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష, బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్‌ఫో ఎగ్జిబిషన్ శుక్రవారం నిర్వహించారు. జిల్లాల్లో పలు స్కూల్స్ నుంచి వివిధ ఎగ్జిబిషన్‌తో విద్యార్థులు హాజరయ్యారు. శివబాబు మాట్లాడుతూ ప్రదర్శనతో విద్యార్థుల సృజనాత్మకతను బయటకు తీసేందుకు అవకాశం ఉందని తెలిపారు. చీరాల ఎంఈఓ గంగాధరరావు మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఇన్నోవేషన్‌లో భారతదేశ స్థానాన్ని ముందుకు తీసు కెళ్లాలని కోరారు. న్యాయనిర్ణేతలుగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎం ద్రాక్షన భావన, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.విజయకిషోర్, బాపట్ల ఫార్మసీ కళాశాలకు చెందిన జాన్ సాగిల్ కళాశాలకు చెందిన డాక్టర్ బి.సుధీర్, మున్సిపల్ హైస్కూల్ బాపట్లలో సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వి.వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెచ్‌ఎం ఆర్.శివనాగేశ్వరరావులు వ్యవహరించారు. కార్యక్రమాన్ని బాపట్ల సమగ్ర శిక్ష జీసీడీవో ఎం.చారులత, జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్ పర్యవేక్షించారు. ఎగ్జిబిట్ల ప్రదర్శనలో అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రథమ స్థానాన్ని కైవసం, ప్రొఫె షనల్ డ్రెస్ కాంపిటీషన్లో ఉపాధ్యా యుని వేషధారణ వేసిన జెడ్పీహెచ్‌ఎస్, అడవిపాలెం విద్యార్థి ప్రథమ స్థానం సాధించారు. జె.పంగులూరు మండలం చందలూరులోని జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కోట భార్గవ శరణ్ ప్రథమ స్థానాన్ని పొందారు.
బాపట్ల ఉపవిద్యాశాఖాధికారి శివబాబు


