గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి రా.12.09 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి సా.4.43 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: తె.4.57 నుండి 6.28 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.42 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృత ఘడియలు: ఉ.10.38 నుండి 12.09 వరకు.
సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
వృషభం... ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మిథునం... రుణాలు చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు.
కర్కాటకం..... రుణబాధలు తీరతాయి. ఆప్తుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
సింహం.... కొన్ని పనులు మధ్యలో విరమించాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చిక్కులు.
కన్య... కొత్త విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల... శుభకార్యాలకు హాజరవుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం...... బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు... వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగులకు ఒత్తిడులు.
మకరం...... దూరపు బంధువుల కలయిక. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
కుంభం...... మిత్రుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
మీనం.... రాబడి తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


