తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా, వర్చువల్ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటిల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తుండడం ఎన్నికల స్టంట్. నిజంగా మున్సిపాలిటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే రెండేళ్లుగా ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇలాంటి డ్రామాలను పట్టణ ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఎన్నికల్లో తెలుగుదేశంకు తగిన గుణపాఠం నేర్పడం ఖాయం.
– అలీమ్‌బాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ పుంగనూరు.


