సమస్యలు తీర్చకుంటే చలో విజయవాడ | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తీర్చకుంటే చలో విజయవాడ

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

సాక్షి, మదనపల్లె: స్వర్ణ గ్రామం–స్వర్ణవార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గుడి నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సంఘ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రధాన సమస్యలైన రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌, ప్రమోషన్‌ ఛానెల్‌, స్పష్టమైన జాబ్‌ చార్ట్‌లను త్వరగా పరిష్కారించాలని కోరారు. సచివాలయం ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కారించకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement