మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని వీవర్స్ కాలనీ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించారు. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లెకు రానున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. సీఎం పర్యటన సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం, భద్రతా ప్రమాణాలు, పరిసర ప్రాంతాల పరిస్థితులను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సంబంధిత అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేశారు.


