పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థి పాముకాటుకు గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం తుగ్గలికి చెందిన సుధాకర్‌ కుమారుడు బాలాజీ (16) మదనపల్లె జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కళాశాల సమీపంలోని చెట్ల పొదల వద్దకు వెళ్లగా పాము కాటేసింది. దీంతో అస్వస్థతకు గురయ్యాడు. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. అధ్యాపకులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం విద్యార్థి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రిన్సిపల్‌ రాజేంద్ర ప్రసాద్‌, అధ్యాపకులు ఆసుపత్రికి చేరుకుని బాలాజీని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో కళాశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement