మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం పరిధిలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (ఏఎంసీ) లోకల్ అథారిటీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తుండడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఏఎంసీ డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సహకారంతో జేసీబీలతో కొన్ని నెలలుగా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వీఆర్వో కత్తి నారాయణ, తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా మట్టిని తవ్వుతున్న జేసీబీని నిలుపుదల చేసి, తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇకపై ఆరోగ్యవరంలో అనుమతి లేకుండా మట్టి తరలించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
జేసీబీని సీజ్ చేసిన అధికారులు


