కూల్‌లిప్‌ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కూల్‌లిప్‌ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్‌

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

నిమ్మనపల్లె(మదనపల్లె టౌన్‌) : నిమ్మనపల్లె మండలంలో విద్యాసంస్థలకు 500 మీటర్ల పరిధిలో గంజాయితో తయారు చేసిన కూల్‌లిప్‌ ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ రామకృష్ణ వివరాల మేరకు.. వాయల్పాడు పట్టణానికి చెందిన పుల్లగూర పవన్‌న్‌ కుమార్‌ అలియాస్‌ మనోజ్‌ (39), నిమ్మనపల్లె మండలం వెంగలవారిపల్లెకు చెందిన సోమిశెట్టి మహేష్‌బాబ (55)తో కలిసి నిమ్మనపల్లె, వాయల్పాడు, గుర్రంకొండ ప్రాంతాల్లో కూల్‌లిప్స్‌ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టగా ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించారన్నారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి వారి వద్ద ఉన్న 23 కూల్‌ లిప్స్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో 15 పౌచ్‌లు ఉండగా మొత్తం సుమారు 345 పౌచ్‌లు, వాటి విలువ రూ.7,935గా నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్యాకెట్లపై స్పష్టమైన పిక్టోరియల్‌ ఆరోగ్య హెచ్చరికలు కనిపించకుండా బ్లర్‌గా ముద్రించినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల సమీపంలో విక్రయాలు చేస్తున్నారనే అభియోగంతో సిగరెట్లు, ఇతర పొగాకు, టోబాకో ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్‌న్‌ 6, 7(1) కింద ఇద్దరినీ అరెస్ట్‌ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement