‘డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు’పై అసత్య ప్రచారాలు | - | Sakshi
Sakshi News home page

‘డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు’పై అసత్య ప్రచారాలు

Sep 23 2026 1:43 AM | Updated on Sep 23 2026 1:43 AM

అంతా రహస్యమే..!

మదనపల్లె టౌన్‌: డ్రైవింగ్‌ లైసెన్స్‌కు మొబైల్‌ నంబర్‌ను సెప్టెంబర్‌ 25 లోపు అప్‌డేట్‌ చేయకపోతే లైసెన్స్‌ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్‌ మీడియా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మెద్దని, అవన్నీ అవాస్తవమని జిల్లా డీటీఓ అశోక్‌ ప్రతాప్‌ రావు తెలిపారు. మంగళవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవస రం లేదని స్పష్టం చేశారు. రవాణా శాఖ సేవ లు, చలానాలు, రెన్యువల్‌ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ప్రయోజనకరమని తెలిపారు. ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు ఫార్వ ర్డ్‌ చేయకుండా, రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని వాహనదారులకు టీడీఓ పలు సూచనలు చేశారు.

జిల్లాలో 57.1 శాతం

లోటు వర్షపాతం

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం తీవ్ర లోటులో ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల నివేదిక వెల్లడించింది. జూన్‌ 1నుంచి సెప్టెంబర్‌ 22 వరకు జిల్లాలో సాధారణంగా 9,011.5 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3,868.7 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో 57.1శాతం లోటు వర్షపాతం నమోదై జిల్లా వర్షపాతం పరిస్థితిని ‘డెఫిషియంట్‌’గా అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల్లో జిల్లాలో 1,363.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ కాలానికి సాధారణ వర్షపాతం 2,182.3 మి.మీ గా ఉండగా, 37.5 శాతం లోటు నమోదైంది. మండలాల వారీగా చూస్తే పీలేరు మాత్రమే సాధారణ స్థితిలో ఉండగా, 12 మండలాలు లోటు ( మరో 12 మండలాలు తీవ్ర లోటు కేటగిరీలో ఉన్నాయి. పంటల సాగు, తాగునీటి వనరులపై వర్షాభావ ప్రభావం పడే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.

పవిత్రోత్సవాలకు

నేడు అంకురార్పణ

కడప సిటీ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 26 వరకు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

నేడు స్వామి, అమ్మవార్ల కల్యాణం

శ్రవణా నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఈ కల్యాణ కార్యక్రమం ఉంటుందని వివరించారు.

– కడప కార్పొరేషన్‌లో

రాత్రివేళ ఓటర్ల జాబితా విడుదల

కడప కార్పొరేషన్‌ : కడప నగరపాలక సంస్థలో ప్రతీది రహస్యంగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ప్రింట్‌, అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రజలకు విరివిగా ఆ సమాచారాన్ని చేరవేయాల్సి ఉంది. ఆ తర్వాత రిజిస్టర్‌ కాబడిన రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా అందజేయాలి. కానీ కడప కార్పొరేషన్‌లో ఈ ప్రక్రియ అంతా చాలా రహస్యంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళ కమిషనర్‌ డా. పి. భవానీ ప్రసాద్‌, అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర, ఏసీపీ మునిరత్నం తదితరులు ఓటర్ల జాబితాను ప్రకటించారు. కానీ మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 8 వాట్సాప్‌ గ్రూపుల్లో పంపించామని కమిషనర్‌ చెప్పారు గానీ ఏ గ్రూపులోనూ ఓటర్ల జాబితా వివరాలు ఇవ్వలేదు. కడప కార్పొరేషన్‌లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, పురుషులు ఎంత మంది, సీ్త్రలు ఎందరు, థర్డ్‌ జెండర్‌ ఎంతమంది అనేది డివిజన్ల వారీగా వివరాలు ప్రకటించాల్సి ఉంది. కానీ అధికారులు ఆ పనిచేయలేదు. ఓటర్ల జాబితా ప్రతులను చేతబట్టుకొని ఓ ఫోటో దిగి మమ అనిపించినట్లు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రింట్‌ చేసిన ఓటర్ల జాబితాను ఇవ్వాల్సి ఉంది. కానీ రాజకీయ పార్టీలు లేఖలు ఇస్తే ఓటర్ల జాబితాలు ఇస్తామని కమిషనర్‌ పేరుతో ఒక పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో డివిజన్ల రిజర్వేషన్లు మొదలుకొని నామినేషన్లు, ఉపసంహరణ, ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థులు వంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. కానీ నగరపాలక యంత్రాంగం ప్రతీది ఇంత రహస్యంగా చే స్తే ప్రజలకు ఖచ్చితమైన సమచారం అందే అవకాశం ఉండదు. ఎన్నికల కమిషన్‌ దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement