నేటితో మండల పరిపాలనకు ఆఖరు | - | Sakshi
Sakshi News home page

నేటితో మండల పరిపాలనకు ఆఖరు

Sep 23 2026 1:43 AM | Updated on Sep 23 2026 1:43 AM

రేపటితో జిల్లా పరిషత్తుకు ఐదేళ్లు పూర్తి

ప్రత్యేక పాలనకు చర్యలు

సాక్షి, మదనపల్లె: మండల ప్రజా పరిషత్‌ పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియనుంది. దీంతో జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మండలాల వారీగా..బి.కొత్తకోటలో 11, చౌడేపల్లిలో 12, గుర్రంకొండలో 12, కేవీ పల్లెలో 12, కలకడలో 11, కలికిరిలో 13, కురబలకోటలో 12, మదనపల్లెలో 27, ములకలచెరువులో 13, నిమ్మనపల్లిలో 9, పెద్దమండ్యంలో 10, పెద్దతిప్పసముద్రంలో 15, పీలేరులో 21, పుంగనూరులో 16, రామసముద్రంలో 14, సదంలో 10, సోమల 12, తంబళ్లపల్లెలో 11, వాయల్పాడులో 13, గాలివీడులో 14, లక్కిరెడ్డిపల్లిలో 11, రామాపురంలో 10, సంబేపల్లిలో 11, రాయచోటిలో 10, చిన్నమండెంలో 10 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీరిలో ఒక ఎంపీటీసీ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా, మరో ఇద్దరు ఎంపీటీసీలు ఉపాధ్యక్షులుగా ఎన్నికై విధులు నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి వీరి స్థానంలో ప్రత్యేక అధికారులు పరిపాలన సాగించనున్నారు. దీనికోసం ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ అధికారులు ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. కాగా మండల పరిషత్‌ అధ్యక్షులు ఇప్పటికే ఎంపీడీఓ కార్యాలయాల్లోని తమ చాంబర్లను ఖాళీ చేశారు.

రేపటితో జెడ్పీటీసీ

జిల్లాలో మండలానికి ఒక జెడ్పీటీసీ చొప్పున 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వీరు ఎన్నికై న నాటికి 2021లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉంది. 22 ఏప్రిల్‌ 4న ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టగా అన్నమయ్య జిల్లా రూపుదిద్దుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలు, ఉమ్మడి చిత్తూరులోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు, వాటిలోని 30 మండలాలతో అన్నమయ్య జిల్లా ఏర్పడింది. ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లా పరిషత్‌ లోని కొనసాగుతూ వస్తున్నాయి. తిరిగి 2025 డిసెంబర్‌ 30న మదనపల్లి జిల్లా కేంద్రంగా పుంగనూరు నియోజకవర్గంలో కలిపి ఐదు నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా పునర్విభజన జరిగింది. ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు, రాయచోటి ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌లో కొనసాగుతున్నాయి. వీరి ఐదేళ్ల పదవీకాలం గురువారంతో ముగుస్తుంది. వీరి స్థానంలో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా బాధ్యతలను చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement