‘ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత’

Sep 8 2026 1:11 AM | Updated on Sep 8 2026 1:11 AM

అమ్మ ఒడి అందరికీ...

మదనపల్లె సిటీ: కూటమి రెండేళ్ల పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కరువై అడ్మిషన్ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. నాడు నేడు నిబంధనల ప్రకారం పాఠశాలల్లో 9 రకాల వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను జత చేసి విద్యాభ్యాసం చేశారు. కూట మి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కనుమరుగయ్యాయి. ఫలితంగా చేరికలు తగ్గిపోయాయి. ఇది క్రమంగా కొనసాగితే అక్షరాస్యతా శాతంపైన ప్రభావం పడే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేరికలు తగ్గుముఖం...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రుల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఒకట్రెండు తరగతుల్లో మినహా అన్ని తరగతుల్లోనూ చేరికలు తగ్గాయి. మొత్తంపై ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2190 అడ్మిషన్లు తగ్గాయి.

అడ్మిషన్ల గణాంకాలు ఇలా...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా ఏటా దాదాపు 1.50 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చేవి. ఐదేళ్లూ ఈ సంఖ్య కాస్త అటూ..ఇటూగా సాగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏటా అడ్మిషన్ల తగ్గుతూ వస్తోంది. గతేడాది అంటే 2025–26 విద్యా సంవత్సరానికి 1,07,730 అడ్మిషన్లు వస్తే.. ఈ ఏడు 1,06,653లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వెయ్యికిపైగా అడ్మిషన్ల సంఖ్య తగ్గింది.

నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వ

పాఠశాలలకు నిధుల వరద

నేడు సౌకర్యాలు కరువై

పెరుగుతున్న డ్రాపౌట్ల సంఖ్య

అక్షరాస్యతా శాతంపై ప్రభావం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడికి వచ్చే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఒకొక్కరికి రూ. 15 వేల చొప్పున తల్లుల ఖతాలకు నగదు జమ అయ్యేది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన విద్యాసామగ్రిని ఆనందంగా కొనుగోలు చేసు కుని నిశ్చింతంగా తమ పిల్లలకు బడికి పంపించుకునేవారు.

కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్నే కాపీ కొట్టి తల్లికి వందనంగా మార్చి అమలు చేస్తోంది. ఇది కూడా సరిగా అమలు చేయడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన మూడు నెలలకుగానీ డబ్బులు తల్లుల ఖతాలకు జమకావడం లేదు. అది కూడా కొందరికి రూ. 13 వేలు పడగా మరికొంత మందికి ఒకొక్కరికి 8, 9 చొప్పున మాత్రమే పడింది. దీంతో చాలా మంది మిగిలిన డబ్బుల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement