కడప కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరినీ గెలిపించే బాధ్యత నియోజకర్గ సమన్వయకర్తలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. సోమారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో అన్ని కమిటీల సభ్యులు 7 నుంచి 9 వేల మంది ఉంటారన్నారు. వారంతా తమ కుటుంబ సభ్యులతోపాటు మరో ఐదుగురితో ఓట్లు వేయిస్తే వైఎస్సార్‌సీపీ విజయం నల్లేరుపై నడక అవుతుందన్నారు. ఇది చాలా కీలక సమయమని, ఈ మూడు నెలలు మనసు పెట్టి పనిచేయాలని సూచించారు. ఈనెల 8వ తేది నుంచి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ఈ గుర్తింపు కార్డులకు ఎంతో విలువ ఉందన్నారు. భవిష్యత్‌లో వారికి ఏ మేలు జరగాలన్నా ఈ కార్డు తప్పనిసరి అవుతుందన్నారు. సర్ ప్రక్రియకు ఈనెల 10వతేది వరకూ గడువు ఉందని, నోటీసులొచ్చిన వారందరినీ విచారణకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.
కోర్ కమిటీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి


