జిల్లా సీనియర్‌ పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా సీనియర్‌ పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

Aug 27 2026 1:24 AM | Updated on Aug 27 2026 1:24 AM

మదనపల్లె సిటీ : జిల్లా సీనియర్‌ పురుషుల పుట్‌బాల్‌ జట్టు ఎంపికలు బుధవారం స్థానిక మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 మందికి పైగా క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. క్రీడాకారుల ప్రతిభ, ఆటతీరు, సామర్థ్యాన్ని పరిశీలించి 20 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న జట్టు ఈనెల 28 నుంచి 31వతేదీ వరకు మైలవరంలో జరగనున్న అంతర్‌ జిల్లా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తారని జిల్లా పుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మురళీధర్‌ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ క్రీడాకారులు సుధాకర్‌, అబ్రహం, రతీష్‌, మోహన్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై

దాడి

మదనపల్లె టౌన్‌ : వ్యాపార లావాదేవీలకు సంబంధించి పాతవివాదాల నేపథ్యంలో రాజేష్‌ అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడి, నగదు, సెల్‌ఫోన్‌న్‌ లాక్కెళ్లినట్లు బాధితుడు మునిరాజశేఖర్‌ బుధవారం మదనపల్లె టూ టౌన్‌న్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మదనపల్లె మండలం, కొండామిరపల్లె పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న తాను గతంలో తన బంధువు రాజేష్‌తో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశానని.. 2021లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రాగా విడిపోయి సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం సీటీఎం రోడ్డులో వెళ్తుండగా రాజేష్‌ తనను అడ్డగించి దాడి చేశాడని మునిరాజశేఖర్‌ ఆరోపించాడు. అంతేకాకుండా తన పర్సును చింపి అందులో ఉన్న నగదుతో పాటు సుమారు రూ.60 వేల విలువైన సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించాడు. దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లు ధ్వంసం:

ఇద్దరిపై కేసు

మదనపల్లె టౌన్‌ : అక్రమంగా ఇంటిని ధ్వంసం చేసిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. ఇంటి కూల్చి వేతకు ఉపయోగించిన జేసీబీ, ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లె మండలం సీటీఎం కు చెందిన చాంద్‌బాషాకు హరిజనవాడ వీధిలో రెండు కుంటల ఇల్లు వంశపారంపర్యంగా సంక్ర మించింది ఉంది. అయితే 2024లో బాధితుడి మేనత్త అమీనాబీ అదే ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించి నిమ్మనపల్లె రోడ్డుకు చెందిన వజీర్‌బాషా అనే వ్యక్తికి విక్రయించింది. అంతటితో ఆగకుండా జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి చాంద్‌ బాషా ఇంటిని నేలమట్టం చేశారు. దీంతో బాధితుడు చాంద్‌ బాషా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు జారీ చేసిన ఎండార్స్‌మెంట్‌ ఆదేశాల మేరకు మదనపల్లె తాలూకా పోలీసులు అమీనాబీ, నజీర్‌బాషాలపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఇంటి ధ్వంసానికి ఉపయోగించిన ఇసుకనూతుపల్లి కి చెందిన రెడ్డప్ప జేసీబీ, ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. నకిలీ పత్రాల సృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement