వీరిరువురు..ఇక తప్పించుకోలేరు ! | - | Sakshi
Sakshi News home page

వీరిరువురు..ఇక తప్పించుకోలేరు !

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

సాక్షి, మదనపల్లె: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు దర్యాప్తు ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ వ్యవస్థీకృత నకిలీ మద్యం దందాలో ఎకై ్సజ్‌ శాఖ మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో ఇప్పటికే 31 మంది అరెస్టయి కటకటాలపాలయ్యారు. ఇక ఈ కేసులో తెరవెనుక సూత్రధారులుగా ఉండి, విచారణకు సహకరించని ఆ ఇద్దరు పచ్చ నేతలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారు. వారే.. సస్పెండ్‌ అయిన తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ డి.జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌ రెడ్డి. వీరిద్దరి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేయడంతో.. ఎకై ్సజ్‌ అధికారులు వీరిని ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందన్న వార్త ఉత్కంఠ రేపుతోంది.

విచారణకు సహాయ నిరాకరణ..

సుప్రీంను ఆశ్రయించిన దర్యాప్తు అధికారి..

సుప్రీంకోర్టు ఇచ్చిన ముందస్తు వెసులుబాటు (తాత్కాలిక రక్షణ)తో విదేశాల నుంచి ములకలచెరువుకు తిరిగి వచ్చిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డిలు రెండు సార్లు ఎకై ్సజ్‌ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారిస్తున్న దర్యాప్తు అధికారి, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరిండెంట్‌ జోగేంద్ర వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించినప్పటికీ.. నిందితులిద్దరూ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారి జోగేంద్ర వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి.. శ్రీకేసులో ముఖ్య నిందితులు ఇద్దరూ విచారణకు సహకరించడం లేదు.. నకిలీ మద్యం దందా వెనుక ఉన్న అసలు నిజాలు, మూలాలు బయటకు తీయాలంటే వీరిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంద్ఙి అని కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు వీరి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేయడంతో, కోర్టు తీర్పు ఉత్తర్వు అందడమే ఆలస్యం ఎకై ్సజ్‌ ప్రత్యేక బృందాలు వీరిని అదుపులోకి తీసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

పాత చార్జ్‌షీట్లు వెనక్కి..

పూర్తిస్థాయిలో సరికొత్త వ్యూహం

ములకలచెరువు సమీపంలోని ఓ గోదాములో నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలకు సంబంధించిన ఈ పెద్ద వ్యవహారం గత అక్టోబర్‌ మూడో తేదీన వెలుగులోకి వచ్చి రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఇప్పటికే తంబళ్లపల్లె కోర్టులో రెండు చార్జ్‌షీట్లను (దోషారోపణ పత్రాలు) దాఖలు చేశారు. అయితే దర్యాప్తు ఇంకా ముగింపునకు రాకపోవడం, కీలక నిందితులైన జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డిల (నిందితులు 17, 18) అరెస్టు పెండింగ్‌లో ఉండటంతో చార్జ్‌షీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండేది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఎకై ్సజ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన ఆ రెండు చార్జ్‌షీట్లను వెనక్కి తీసుకొని, ఈ ఇద్దరు పచ్చ నేతల అరెస్టు మరియు విచారణ అనంతరం సేకరించాల్సిన మరిన్ని పక్కా ఆధారాలతో ఏకకాలంలో ‘పూర్తిస్థాయి సమగ్ర సింగిల్‌ చార్జ్‌షీట్‌’ను దాఖలు చేసేందుకు ఎకై ్సజ్‌ ఉన్నతాధికారులు చట్టపరమైన కసరత్తులు ప్రారంభించారు.

సుప్రీంకోర్టులో జయచంద్రారెడ్డి,

గిరిధర్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

తక్షణ అరెస్టుకు

ఎకై ్సజ్‌ ఏఈఎస్‌ జోగేంద్ర రెడీ

రెండు సార్లు విచారణకు పిలిచినా

సహకరించని పచ్చ నేతలు

కస్టడీ కోసం సుప్రీంను ఆశ్రయించిన దర్యాప్తు అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement