కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం తమ ప్రాంగణంలో 5–ఏళ్ల ఇంటిగ్రేటెడ్ యూజీ–పీజీ (6 కోర్సులు), ఆనర్స్ డిగ్రీ (4 కోర్సులు) ప్రోగ్రామ్‌లను అందిస్తోందని ప్రవేశాల సంచాలకులు ఆచార్య వి.రామకృష్ణ తెలిపారు. నాణ్యమైన ఉన్నత విద్యా అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులు ఈ నెల 23 వరకు జరిగే వెబ్–ఆప్షన్ ప్రక్రియలో యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా కోర్సు కోడ్‌ల వివరాలను వెల్లడించారు. యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల కోడ్ – 21587గా వివరించారు.
బీఎస్సీ./ఎంఎస్సీ. ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్( కోర్సు కోడ్ 1879) బీఎస్సీ/ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ – 1880, బీఎస్సీ/ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ – 1881, బీఏ /ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ – 1884, బీఏ/ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ – 1883, బీఏ/ఎంఏ ఇంటిగ్రేటెడ్ తెలుగు– 1882, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) – 1656, బీకాం ఆనర్స్ (కంప్యూటర్ అప్లికేషన్స్)– 1505, బీఎస్సీ ఆనర్స్ (ఫిజిక్స్) – 1524, బీఎస్సీ ఆనర్స్ (కెమిస్ట్రీ) – 1554 కోడ్‌లకు ఆప్షన్లు ఇవ్వాలని వివరించారు.
అక్రమ మద్యం రవాణాపై నిఘా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాలో ఇతర రాష్ట్రాల మద్యం రవాణా జరగకుండా నిరంతరం నిఘా నిర్వహిస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. గురువారం నగరంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రెండు జిల్లాల ప్రొహిబిషన్–ఎకై ్సజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన ఎకై ్సజ్ రెవెన్యూ లక్ష్యాలను వంద శాతం సాధించేలా అధికా రులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మద్యాన్ని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.


