నూతన నియామకం | - | Sakshi
Sakshi News home page

నూతన నియామకం

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

సాక్షి, మదనపల్లె: వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విభా గాలకు పార్టీ నేతలను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోడూరుకు చెందిన ఏ. అబ్దుల్‌ ముజీబ్‌, న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కోడూరుకు చెందిన లింగం అశోక్‌ కుమార్‌ను నియమించారు.

జాగ్రత్తలతోనే

దోమల నివారణ సాధ్యం

మదనపల్లె టౌన్‌: దోమల వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ దోమల దినం సందర్భంగా గురువారం జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ రఫీ మాట్లాడుతూ.. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా, జికా వంటి వ్యాధులు వస్తాయన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, ఫ్రిజ్‌ ట్రేలు, కూలర్లు, పూల కుండీల్లో నీటిని వారానికి ఒకసారి మార్చడం వంటివి చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమలు, వ్యాధులను నివారించవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి అవగాహన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు తగు సూచనలు చేశారు.

సేవా పతకాలు ప్రదానం

కడప అర్బన్‌: 2025 సంవత్సరానికి విశిష్ట సేవలందించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రకటించిన ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలను వైఎస్సార్‌ జిల్లా ఎస్‌.పి షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రదానం చేశారు. ఈ సందర్బంగా వారిని జిల్లా ఎస్‌.పీ ప్రత్యేకంగా అభినందించి మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

ఉత్కృష్ట సేవ పతకాలు– 2025 పొందిన వారు

బాలమద్దిలేటి, సీఐ, చింతకొమ్మదిన్నె పీ.ఎస్‌, వి.శ్రీధర్‌ బాబు, పిసీ202 కడప ట్రాఫిక్‌ పీస్‌.ఎం. అబ్దుల్‌ సలాం, పీసీ.423, డి.సి.ఆర్‌.బి,కడప. పి. సుధాకర్‌, హెచ్‌సీ.534, రాజుపాలెం పీఎస్‌, ఎం. మహేష్‌, పీసీ.709, దువ్వూరు పీఎస్‌,డి. వెంకట భార్గవ్‌, సీపీ.797, సీకేదిన్నె పీఎస్‌, ఈ. విశ్వనాథ్‌, పీసీ.1137, ఐటీ కోర్‌ టీమ్‌, ఆర్‌.వీరాంజనేయులు, పీసీ.2072, ప్రొద్దుటూరు ఐఐఐ టౌన్‌ పీఎస్‌, .పి. మహేష్‌ కుమార్‌ రావు, పి.సి.2128, పెద్దముడియం పీఎస్‌, ఎస్‌. రామ మోహన్‌ రెడ్డి, ఏ.ఆర్‌.పి.సి.1804, డీఏఆర్‌., కడప, ఎస్‌. జాఫర్‌ బాషా, ఏఆర్‌పీసీ.1814, డీఏఆర్‌., కడప.

అతి ఉత్కృష్ట సేవా పతక గ్రహీతలు

ఎస్‌. అక్బర్‌ అలీ, ఏ.ఎస్‌.ఐ.549, ఐ.టి. కోర్‌ టీమ్‌, ఎస్‌.అహ్మద్‌ అలీ, హెచ్‌సీ 1634, ఏహెచ్‌టీయూ, ఎస్‌. సూర్యప్రకాశ్‌ రావు, హెచ్‌సీ.1545, ఎస్‌. వెంకట సుబ్బయ్య, హెచ్‌సీ 1496, బద్వేల్‌ యు/జిపీఎస్‌, ఎస్‌. మహబూబ్‌ బాషా, హెచ్‌సీ 1424, జమ్మలమడుగు యు/జి పీఎస్‌. పి. నరసయ్య, పి.సి.3277, ప్రొద్దుటూరు ఐఐ టౌన్‌ యు/జి పి.ఎస్‌, వై. శ్రీనివాసులు, హెచ్‌సీ.1963, కడప ఐ టౌన్‌ యు/జి పి.ఎస్‌, ఎం. శివ రామయ్య, ఏఆర్‌హెచ్‌సీ.2481, డీఏఆర్‌., కడప. ఎల్‌. రమణారెడ్డి, ఏ.ఆర్‌హెచ్‌సీ.1222, డీఏ.ఆర్‌, కడప. జి. నాగేశ్వరయ్య, పి.సి.1564, మన్నూరు పీ ఎస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement