న్యూస్‌రీల్
కార్యక్రమ వివరాలు
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026
బీటి కళాశాల మైదానంలో సిద్దమైన వేదిక
సాక్షి, మదనపల్లె: అన్నమయ్యజిల్లాకు మదనపల్లె కేంద్రం అయ్యాక తొలిసారిగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను వేడుకగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. శనివారం స్థానిక బీటీ కళాశాల మైదానం వేదికగా ఈ సంబరాల వేడుక జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వేడుకలకు రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. పరేడ్, పోలీసు గౌరవ వందనం, స్వాతంత్ర సమరయోధుల సన్మానం, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్క్కతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు మైదానాన్ని పండుగ వాతావరణంలో అలంకరించి, ప్రజలు వేడుకలను వీక్షించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
విద్యుత్‌దీప కాంతుల్లో కలెక్టరేట్
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని గాంధీరోడ్డులోని కలెక్టరేట్ విద్యుత్‌దీప కాంతులతో ముస్తాబైంది. మువ్వెన్నెల జెండా రంగుల్లో విద్యుత్‌దీపాలు అలరిస్తోంది. మున్సిపల్ కమీషనర్ కార్యాలయంతోపాటు పలు కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
మువ్వెన్నల జెండా రంగుల్లో వెలిగిపోతున్న కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం
8.50 గంటలకు: జిల్లా ఎస్పీ రాక, పరేడ్ ద్వారా జనరల్ సెల్యూట్
8.53 : కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ రాక, జనరల్ సెల్యూట్
8.55 : ముఖ్య అతిథి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాక
9.00 : జాతీయ పతాకావిష్కరణ
9.05 : పోలీసు గౌరవ వందనం స్వీకరణ, కవాతు వీక్షణ
9.15 : మంత్రి మండిపల్లి ప్రసంగం
10.05 : స్వాతంత్ర సమరయోధులకు సత్కారం
10.15 : ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన
10.30 : సాంస్క్కృతిక కార్యక్రమాలు
11.25 : ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రధానం
12.05 : వివిధ శాఖల స్టాళ్ల సందర్శన
12.15 : జాతీయ గీతంతో కార్యక్రమం ముగింపు


