భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెకు ప్రత్యేక స్థానం ఉంది .
● హోమ్‌రూల్ ఉద్యమ కేంద్రం : ఐరిష్ వనిత డాక్టర్ అనిబెసెంట్ హోంరూల్ ఉద్యమ కేంద్రంగా మదనపల్లెను ఎంచుకుని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు.
● విద్యార్థుల తిరుగుబాటు: గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్ఫూర్తితో మదనపల్లె బీటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు సాగించారు.
● మద్రాస్ వర్సిటీ కక్షసాధింపు: ఉద్యమాలకు వేదికై ందనే కోపంతో బీటీ కళాశాల గుర్తింపును మద్రాసు విశ్వవిద్యాలయం రద్దు చేసింది.
● శాంతినికేతన్‌తో అనుబంధం: కళాశాలను కాపాడేందుకు అనిబెసెంట్ దీనిని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు చెందిన ‘శాంతినికేతన్’ విశ్వవిద్యాలయానికి అనుబంధం చేశారు.
● ఠాగూర్ మదనపల్లె పర్యటన: ఈ నేపథ్యంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ 1919 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు కళాశాల ఆవరణలోని కాటేజీలో బస చేశారు.
● జనగణమన ఆంగ్ల అనువాదం: బీటీ కళాశాలలోని బిసెంట్‌హాలులోనే ఠాగూర్ బెంగాలీ ‘జనగణమన’ను ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.
● అపూర్వ స్వరకల్పన: నాటి ప్రిన్సిపాల్ భార్య, సంగీత ఉపాధ్యాయురాలు మార్గెరేట్ కజిన్స్ ఈ గీతానికి అద్భుతమైన బాణీ సమకూర్చారు.
● తొలి గీతాలాపన: 1919 ఫిబ్రవరి 28న రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యార్థులతో కలిసి ఈ జాతీయ గీతాన్ని మదనపల్లె గడ్డపైనే స్వయంగా తొలిసారి ఆలపించారు.
● చారిత్రక గుర్తింపు: 1950 జనవరి 24న భారత ప్రభుత్వం దీనిని అధికారిక జాతీయగీతంగా ప్రకటించింది.
● ఠాగూర్ విగ్రహ ఏర్పాటు: 2012లో కళాశాల శతవార్షికోత్సవాల సందర్భంగా ఇక్కడ 90 కిలోల ఠాగూర్ పాలరాతి విగ్రహాన్ని, ‘ఠాగూర్ కాటేజీ’ని ఏర్పాటు చేశారు.


