మదనపల్లె సిటీ : జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ద్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించినట్లు సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర నున్నా అనూరాధ తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 20 టీచింగ్ పోస్టుల భర్తీకి జూన్ నెలలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన మార్కుల అధారంగా పోస్టుల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. పీఈటీ, సీఆర్టీ, పీజీటీ పోస్టులకు వేర్వేరు కౌంటర్లను ఏర్పాటు చేసి ద్రువపత్రాలను ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలతో పరిశీలన చేసినట్లు తెలిపారు. ధ్రువపత్రాల తుది పరిశీలన అనంతరం నోటిఫికేషన్‌లో పేర్కొన్న కేటగిరీల్లో మెరిట్‌లో మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థులకు నేరుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో సుమతి, అసిస్టెంట్ జీసీడీవో యశోద, సీఎంఓ కరుణాకర్, ప్రదానోపాధ్యాయులు శ్రీనివాసులు, రెడ్డప్పరెడ్డి, మోహన్, చంద్రకళ, లలతితమ్మ, ఆఫీసు అసిస్టెంట్ రెడ్డిశేఖర్ పాల్గొన్నారు.


