నేతన్న సేవ పడలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఐదేళ్లు నేతన్న నేస్తం నిధులు కరెక్టుగా పడ్డాయి. ఇప్పుడు నేతన్న సేవ నగదు జమ కాలేదు. కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని ఎంతగానో ఆశించా. 40 ఏళ్లుగా చేనేత కార్మికుడిగా ఉన్నా. అర్హత ఉన్న వారిని గుర్తించి లబ్ధి చేకూర్చాలి.
– టి.ప్రతాప్, చేనేత కార్మికుడు, వినాయక చేనేతనగర్, కురబలకోట మండలం
జగన్ హయాంలో ఠంచనుగా పడేది
జగన్ ప్రభుత్వ హ యాంలో ఠంచనుగా నేతన్న నేస్తం పడేది. ఇప్పుడు కూటమి ప్ర భుత్వంలో అర్హులకు కూడా ఎగనామం పె ట్టారు. అర్హత ఉండి కూడా జమ కాలేదు. చేతి వృత్తుల్లో ఇంత కష్టమైన సూక్ష్మమైన పని లేదు. ఇలాంటి కష్టజీవులకు న్యాయం జరగలేదు. తలచుకుంటే బాధగా ఉంది.
–బి.నారాయణ రెడ్డి, చేనేత కార్మికుడు


