కుటుంబసభ్యులు మందలించారని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబసభ్యులు మందలించారని ఆత్మహత్య

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

కుటుంబసభ్యులు మందలించారని ఆత్మహత్య ఎల్లమ్మ ఆలయంలో చోరీ

మదనపల్లె టౌన్‌: ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని కుటుంబీకులు మందలించడంతో మనస్థాపం చెందిన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం మదనపల్లెలో వెలుగు చూసింది. మృతుడి కుటుంబీకులు, రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక మోతి నగర్‌ లో కాపురం ఉంటున్న చాంద్‌ బాషా కుమారుడు పి.లతీఫ్‌ (25), కొత్తగా నిర్మించిన ఇళ్లకు గ్లాస్‌ వర్కర్‌ గా పని చేస్తాడు. విధుల్లో భాగంగా స్థానిక చంద్ర కాలనీలో ఇంటికి గ్లాస్‌ వర్క్‌ చేసేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. పని ముగించుకుని రోజు అర్థ రాత్రి వేళ ఇంటికి వస్తున్నారని కుటుంబీకులు మందలించారని తెలిపారు. దీంతో చంద్ర కాలనీలో పనిచేస్తున్న ఇంటిలోనే తెల్లవారుజామున లతీఫ్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న టూ టౌన్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహమ్మద్‌ రఫి తెలిపారు.

నందలూరు : పాటూరు గ్రామ పంచాయతీలోని ఎల్లమ్మ ఆలయంలోకి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 గ్రాముల విలువైన మూడు బంగారు తాళిబొట్లను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement