ఆదివాసీల హక్కుల కోసం పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల హక్కుల కోసం పోరాటం

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

పుంగనూరు: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు ఇవ్వాల్సిన పథకాలను అందించడం లేదని , హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు సాగిస్తామని వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి మునీంద్రనాయక్‌ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆదివాసీల దినోత్సవాన్ని గిరిజన మహిళలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. గిరిజనులను సంరక్షించుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ప్రభాకర్‌నాయక్‌, శ్రీరాములునాయక్‌, శ్రీనివాసులునాయక్‌, వాసునాయక్‌, రెడ్డెప్పనాయక్‌, బుడ్డన్ననాయక్‌, తిప్పానాయక్‌, నరసింహులునాయక్‌, రాజునాయక్‌, రవికుమార్‌నాయక్‌, శివశంకర్‌నాయక్‌, అంజినాయక్‌, శీన, దేవమ్మ, శారద, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement