మదనపల్లె టౌన్: మదనపల్లె పట్టణంలో వి ఎస్‌ఆర్ గ్రాండ్ లో నడుస్తున్న ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలు. స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు, మంటలు వస్తుండడంతో గమనించి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి పూర్తిగా ఆర్పివేశారు. రెస్టారెంట్‌లోని కిచెన్‌న్‌లో గల చిమ్నీ వద్ద నుంచి ప్రమాదం మొదలైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అగ్ని మాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు.రెస్టారెంట్ యజమాని వి.సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


