వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ గుండాల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ గుండాల దాడి

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన మాజీ సర్పంచ్‌ కుమారుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు నల్లంకి నాగేంద్ర బాబు ఐదు షెడ్లలో కోళ్లఫారం నడుపుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో మూడు షెడ్లు ననిత అనే ఆమెకు లీజుకు ఇచ్చానని, అయితే గురువారం రాత్రి కోళ్లఫారం వద్దకు వెళ్లిన ననిత, ఆమె కుమారుడు యశ్వంత్‌, స్నేహితుడు గిరీష్‌, టీడీపీ చెందిన హర్షవర్థన్‌, తేజ పక్కన ఉన్న యజమాని కోళ్లఫారంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సంచులను దొంగతనంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న కూలీ గులాబ్‌ దస్తగిర్‌, అతని భార్య ఇద్దరు అడ్డుపడి సంచులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఎవరిని అడిగారు అని ప్రశ్నించగా.. టీడీపీ నాయకులము మమ్మల్నే అడుగుతావా అంటూ గులాబ్‌ దస్తగిర్‌పై దాడికి పాల్పడి, దౌర్జన్యంగా సంచులను ఎత్తుకెళ్లినట్లు నాగేంద్రబాబు తెలిపారు. విషయం తెలుసుకున్న కోళ్లఫారం యజమాని, వైఎస్సార్‌సీపీ నాయకుడు నల్లంకి నాగేంద్ర బాబు సంఘటనాస్థలానికి చేరుకొని మా కూలీపై ఎందుకు దాడి చేశారు అని అడగగా.. నాగేంద్ర బాబుపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో గులాబ్‌ దస్తగిర్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం నల్లంకి నాగేంద్రబాబు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కోళ్లఫారంలోకి వచ్చి యజమానిపై దౌర్జన్యం

అడ్డుపడిన కూలీపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement