వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడామైదానంలో సౌత్‌జోన్ అండర్ –23 ఉమెన్స్ వన్‌డే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలు జరిగాయి. శుక్రవారం గ్రౌండ్ 1లో జరిగిన కడప, అనంతపురం మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన అనంతపురం జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 304 స్కోర్ చేసింది. అనంతరం బ్యాంటింగ్ చేపట్టిన కడప జట్టు 36 ఓవర్లలో 122 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 144 పరుగుల తేడాతో అనంతపురం విజయం సాధించింది. అనంతపురం జట్టుకు చెందిన ఆర్షియానేహా 102 బంతుల్లో 96 పరుగులు చేసింది.హాన్సిరెడ్డి 75 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసుకుంది. అలాగే నందిని 28పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు తీసుకుని జట్టు విజయంలో వీరు కీలకపాత్ర పోషించారు. గ్రౌండ్ 2లో చిత్తూరు, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ చేపట్టి 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 17.3 ఓవర్లలో 84 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కర్నూలు జట్టు 214 పరుగుల తేడాతో గెలుపొందింది. కర్నూలు జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ శ్రీనవ్య 134 బంతుల్లో 107 పరుగులు చేసింది. అలాగే ఇదే జట్టుకు చెందిన ఫాజియా కేవలం 4 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకొని జట్టు విజయానికి దోహదం చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, శ్రీధర్‌కుమార్, సతీష్‌యాదవ్, సునీల్‌కుమార్, అనిత, యామిని, మౌనిక, శేఖర్, మాధవి, తదితరులు పాల్గొన్నారు.


