కొనసాగుతున్న టెట్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న టెట్‌ పరీక్షలు

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

మదనపల్లె సిటీ : ఏపీ టెట్‌ పరీక్షలు రెండవ రోజు గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మదనపల్లె సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజీలో 89 మంది, మిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో 88 మంది, సాయి ఇంజనీరింగ్‌ కాలేజీలో 134 మంది, భాస్కర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో 85 మంది హాజరయ్యారు. మిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగిన టెట్‌ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు డాక్టర్‌ డి.మధుసూదనరావు పరిశీలించారు.అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, కంప్యూటర్‌ సిస్టమ్‌ లభ్యతను తనిఖీ చేశారు. ఆయన వెంట డీఈఓ సుబ్రమణ్యం ఉన్నారు.

ప్రభుత్వ భూములు

గుర్తించాలి

మదనపల్లె సిటీ : పీకేఎంయూడీఏ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని పీకేఎంయూడీఏ వైస్‌ చైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ అన్నారు. గురువారం స్థానిక పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ శాఖల ప్రగతిపై సమీ క్షా సమావేశం జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించి పురోగతిపై ఇంజనీరింగ్‌ సిబ్బందితో సమీక్షించి పనులను త్వరగా పూర్తి చేయా లని ఆదేశించారు. పీకేఎంయూడీఏ సెక్రటరీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

వెలగనున్న హైవే లైట్లు

కురబలకోట : మదనపల్లి– అంగళ్లు మార్గంలో హైవేపై పెండింగ్‌లో ఉన్న వీధి లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మండల ట్రాన్స్‌కో ఏఈ శంకర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం సాక్షి దినపత్రికలో హైవేలో వెలగని లైట్లు అనే వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో కాంట్రాక్టర్‌ నుంచి డిపాజిట్‌ కట్టించి వీటిని వేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని సర్కారుతోపు నుంచి విశ్వం సర్కిల్‌ వరకు అదే విధంగా కడప క్రాస్‌, కాండ్లమడుగు క్రాస్‌ వరకు వీటిని వేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ హైవేపై నిత్యం వేలాది మందితోపాటు పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న హైవే పై వేధి లైట్లు వేయడానికి అధికారులు చర్యలు చేపట్టడంతో ప్రయాణీకులు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement