వేలిముద్ర వేయించుకుని భూమి కాజేశారు | - | Sakshi
Sakshi News home page

వేలిముద్ర వేయించుకుని భూమి కాజేశారు

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

మదనపల్లె టౌన్‌: చదువురాని తన తల్లి దగ్గర వేలిముద్రలు వేయించుకుని తమ భూమిని కాజేయడమేకాకుండా ఆ భూమిలోకి తమను రానీయకుండా అడ్డుకుంటున్నారని ఓ బాధితురాలు చంటి బిడ్డలతో జిల్లా ఎస్పీ కార్యలయానికి వచ్చింది. తమకు జరుగుతున్న అన్యాయంపై గురువారం మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లికి ఫిర్యాదు చేసింది. బాధితుల కథనం మేరకు.. పుంగనూరు మండలం, చిన్ననల్లూరుపల్లెకు చెందిన కౌసల్య భూమిలో అదేగ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి దౌర్జన్యంగా కట్టడాల కోసం తవ్వకాలు చేపట్టాడని బాధితురాలు తెలిపింది. దశాబ్దాల కిందట నుంచే సర్వే నంబర్‌ 248–6లో 43 సెంట్ల భూమి తమ ఆధీనంలో ఉందన్నారు. ఇటీవల తన తల్లి ధనలక్ష్మీ దగ్గర వేలిముద్రలు తీసుకొని, విక్రయించిందనే సాకుతో సుబ్బిరెడ్డి తమపై దౌన్జన్యాలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఇటీ వల న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తమకు ఇంజెక్షన్‌ ఆర్డరు కూడా ఇచ్చారని, అయినా అతను భూమిలోకి రావద్దని బెదిరిస్తున్నాడని, న్యాయం చేయాలని తల్లీ బిడ్డ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement