గ్యాస్‌ లీకేజీతో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకేజీతో అగ్నిప్రమాదం

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

తంబళ్లపల్లె: గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ కావడంతో మంటలు చెలరేగిన ఘటనలో అక్కా తమ్ముడు సహా దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు.. గోపిదిన్నెకు చెందిన ప్రకాష్‌, పవిత్ర అనే అక్కా తమ్ముళ్లు వంట గదిలో గ్యాస్‌ వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. సిలిండర్‌ ఆఫ్‌ చేసేందుకు వెళ్లి తలుపు తెరవగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కా తమ్ముడు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. మంటలను ఆర్పేందుకు వెళ్లిన స్థానిక దంపతులు కూడా గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా నలుగురిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. అక్కా తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

క్షతగాత్రులను పరామర్శించిన

ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి

గ్యాస్‌ లీక్‌ అయి గాయపడిన బాధితులను, కుటుంబీకులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి రుయా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు నల్లగుడ్ల మల్లికార్జున రెడ్డి బాధితులకు రూ. ఐదువేలు ఆర్థిక సాయం అందించారు.

మంటల్లో చిక్కి అక్కా తమ్ముడు,

దంపతులకు తీవ్ర గాయాలు

గాయపడిన అక్కా తమ్ముడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement