సదుం: స్థానిక వళ్లీదేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు జరుగుతున్నాయి. భరణి కావిళ్లను పురస్కరించుకుని పలువురు భక్తులు ఆలయాన్ని దర్శించారు. పుష్పకావిళ్లతో మొక్కులు చెల్లించారు. ప్రతిఏటా ఆడికృత్తిక ఉత్సవాలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్‌రెడ్డి, నారాయణరెడ్డి, బాబురెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి నూతన వెండి కడియాలను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దంపతులు గురువారం అందించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి ఇందిరమ్మ, కవితమ్మ, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.భట్టువారిపల్లె వద్ద తిరుమలకు పాదయాత్ర చేసే భక్తుల కోసం నూతన షెడ్ నిర్మిస్తున్నారు. పనులను ఎమ్మెల్యే పరీశీలించారు.


