ఎరువుల దుకాణాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాల తనిఖీ

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

గుర్రంకొండ: మండలకేంద్రమైన గుర్రంకొండలో ఎరువుల దుకాణాల్లో కేంద్ర ఆడిట్‌ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది బుధవారం స్థానిక బస్టాండులోని ఎరువుల్లో దుకాణాల్లో కేంద్రబృందం సభ్యులు అశోక్‌మీనా, నవీన్‌, సోమయాజులులు రికార్డులను తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్‌లు, స్టాక్‌ బోర్డు, స్టాకు వివరాల రిజిష్టర్లను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. దుకాణాల్లో ఎరువులను కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. లేని పక్షంల్లో దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి దుకాణం ఎదుట ధరలను సూచించే బోర్డులను తప్పనిసరిగా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఎరువుల దుకాణాలకు సంబందించిన గోడౌన్లను తనీఖీ చేశారు. అక్కడ స్టాకు ఉంచిన ఎరువుల బస్తాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె వ్యవసాయశాఖ ఏడీఏ మజీద్‌అహ్మాద్‌, టెక్నికల్‌ ఏవో నవంత్‌బాబు, ఏవో రత్నమ్మ తదితరులు పాల్గోన్నారు.

రికార్డుల పరిశీలన

ములకలచెరువు: స్థానిక మండల కేంద్రంలోని ప్రధానమంత్రి కిసాన్‌ సంవృద్ధి కేంద్రాలను కేంద్ర బృందం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డులు, ఎరువులను పరిశీలించారు. అనంతరం కేంద్ర బృందం మాట్లాడుతూ... కాలం చెల్లిన ఎరువులు రైతులకు విక్రయించరాదని ఆదేసించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం అశోక్‌కుమార్‌, నవీన్‌, సోమయాజులు, మస్జిద్‌ అహ్మద్‌, ఏఓ శ్రవంతి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement